Sunday, 5 February 2017

మై కోట్స్ (7)

"గంటల తరబడి, రోజుల తరబడి చేయాలనుకుంటున్న కార్యం  గురించి ఆలోచిస్తూ కూర్చోవడం కంటే, ఒక అడుగు ముందుకు వేసి ఆలోచనతో పాటు ఆచరణను కూడా అమలుపరిస్తే మనమెంచుకున్న కార్యం తప్పకుండా ఫలిస్తుంది."

~ జె.శ్వేతాగోదావరి (జక్క శ్వేత)©®™

మై కోట్స్ (6)

సమయ ఎంత విలువైనదో, అది మన చేజేతులారా దుర్వినియోగం అయినప్పుడు మాత్రమే మనకు తెలిసి వస్తుంది.

~ జె. శ్వేతాగోదావరి (జక్క శ్వేత)©®™

Saturday, 4 February 2017

మై కోట్స్ (5)

మనం భూమిమీద పడిన మరుక్షణం నుండి మనల్ని అల్లారుముద్దుగా, జాగ్రత్తగా కాపాడుకుంటూ, పెంచి పెద్దచేసి, మనల్ని ఇంతటివారిని చేసిన మన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో మనకు వారు చంటిపిల్లలతో సమానం. స్థితిలో వారింజ్ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని తెలిసి కూడా, మనల్ని కన్న మన తల్లిదండ్రుల పట్ల ఎందుకింత మనకు విముఖత? విముఖతే లేకపోతే వృద్ధాశ్రమాలు అసలు ఉండేవి కావేమో !!

- జె శ్వేతాగోదావరి (జక్క శ్వేత)©®™

Tuesday, 31 January 2017

మై కోట్స్ (4)

" డబ్బు, ఆస్తులు, అంతస్తులు, చదువులు, బంధాలు - బంధుత్వాలు, ప్రేమలు, స్నేహాలు ఎన్ని ఉన్నా కూడా, వ్యక్తికి తన జీవితంలో కనీస స్వేచ్ఛా- స్వతంత్రత లేకపోతే, అవి అన్నీ ఉన్నప్పటికీ ఆ వ్యక్తి జీవితం ఒక బానిస జీవితంతో సమానం. "
# జె. శ్వేతాగోదావరి (జక్క శ్వేత)©®™

Monday, 30 January 2017

మై కోట్స్ (3)

" ఎల్లప్పుడూ అబద్ధాలు చెబుతూ అందర్నీ మోసం చేసే వ్యక్తికి, ఎదుటివారు చెప్పే నిజాలు అబద్దపు మాటలుగా తోచడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇలాంటివారు ఆ సత్య హరిశ్చంద్రుని మాటలను కూడా నమ్మలేరు. "
# జె శ్వేతాగోదావరి (జక్క శ్వేత)©®